28 June, 2026 | 2:54 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

27-02-2026 12:45 AM

47వ డివిజన్ కార్పొరేటర్ జీవీఆర్ 

పాల్వంచ, ఫిబ్రవరి 26, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్  పరిధిలోని 47వ డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతనంగా ఎన్నుకోబడిన గుర్రం వెంకటేశ్వర్లు (జివిఆర్) అన్నారు. గురువారం ఆయన డివిజన్ పరిధిలో పర్యటించి డ్రైనేజీ, ఇది లైట్లు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.

చెత్తతో నిండిపోయిన డ్రైనేజీలను శుభ్రం చేయించడం, వీధి దీపాలు లేక అంధకారంలో ఉన్న స్తంభాలకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి వెలుగులు వచ్చేలా చూడటం, పారిశుద్ధ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. ప్రజలకు డివిజన్ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.