1 September, 2026 | 12:26 PM

మహా ధర్నాకు పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయులు

01-09-2026 10:59 AM

బోథ్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): బోథ్ ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన మహా ధర్నాకు పీఆర్టీయూటీఎస్ ఉపాధ్యాయులు తరలివెళ్లారు. పీఆర్టీయూటీఎస్ మండల అధ్యక్షుడు ఆర్.టి.వి. ప్రసాద్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని, హెల్త్ కార్డులను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘు స్వామి, బిక్క గంగయ్య, సరఫద్దీన్, రవిరాజ్, రావుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.