1 September, 2026 | 11:46 AM

మాజీ జెడ్పీటీసీ నాగినేనిని పరామర్శించిన సదానందం

01-09-2026 10:53 AM

ముత్తారం,సెప్టెంబర్ (విజయ క్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తారం మాజీ జెడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగినేని జగన్మోహన్‌రావును పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం కరీంనగర్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్‌రావు చేసిన సేవలను సదానందం గుర్తుచేశారు.