2 May, 2026 | 9:34 PM

జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం

02-05-2026 08:05 PM

జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు

నిజాంసాగర్,(విజయక్రాంతి):  జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. ఆయన శనివారం నాడు పిట్లం మండలంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన  ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా  జుక్కల్ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత (పింఛన్లు), రేషన్,, ఆహార భద్రత పథకాలు, విద్యుత్,ఇతర సబ్సిడీలు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.

జుక్కల్ నియోజకవర్గంలో సుమారు 35 వేల మందికి కొత్త రేషన్ కార్డులను అందించామని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్,ఎల్ఓసి ద్వారా దాదాపు 35 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. పిట్లం మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బిచ్కుంద మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఏఎంసీ చైర్మన్‌లు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.