08-02-2026 12:00:00 AM
డాక్టర్ తిరుణహరి శేషు :
ప్రత్యర్థి పార్టీలపై నాయకులపై పైచే యి సాధించటానికి రాజకీయా ల్లో వ్యూహాలు, ఎత్తుగడలు డైవర్షన్ పాలిటిక్స్ లాంటి ఆస్త్రాలను వాడడం సర్వసా ధారణం. గత కొంతకాలంగా తెలుగు నేలపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీకార రాజకీయాలు, తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ తరచూ రాజకీయ చిత్రపటంపై కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఒక దశాబ్దపు బీఆర్‌ఎస్ పాలనకు ముగింపు పలుకుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రెండు వసంతాలు పూర్తిచేసుకుని మూడో వసంతంలోకి అడుగు పె ట్టింది.
అయితే ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నికల సందర్భంగా ప్రజలకి ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్ల అమలుపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తు న్నాయి. దీనికి బదులుగా ప్రభుత్వం నుంచి ఎదురుదాడి, విషయాలను పక్కదారి పట్టించే విమర్శలు, కేసులు, విచారణలు తెరపైకి తెచ్చి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుం టుందనే భావన కలుగుతున్నది.
ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై కాకుండా గత పాలకుల వైఫల్యాలపైనే చర్చ జరిగే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ, దాని నాయకత్వం విజయం సాధించిందని చెప్పొచ్చు. శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డులు కూడా పంచింది. ఇంతవరకు బాగానే ఉంది.
గ్యారంటీ లేని హామీలు..
కానీ ఈ రెండు సంవత్సరాల్లో ఆరు గ్యా రెంటీల్లో ఉన్న 13 హామీల్లో 8 హామీలను అమల్లోకి తెచ్చి, మరొక 5 హామీలు ము ఖ్యంగా మహిళలకు నెలకు 2,500, వృద్ధులకు ఇచ్చే పెన్షన్ 4వేల రూపాయలకు పెంపు, రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు లాంటి గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలం కావడంతో ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. ఈ అమలు కానీ హామీలు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది.
అయితే అమలవుతున్న ‘ఇందిరమ్మ ఇళు’్ల లక్ష్యం మేరకు నిర్మాణం కాకపోవటం, గ్యాస్ సబ్సిడీలో గందరగోళం నెలకొనడంతో ఉచిత విద్యుత్, ఫ్రీ బస్సునే ప్రభుత్వం ప్రచారస్త్రాలుగా వాడుకుంటుంది. వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులకు ఉచిత బస్ పరిమితం చేస్తే బాగుండేదని, ప్రస్తుతం అమలవుతున్న ఫ్రీ బస్ సౌకర్యం వల్ల పెద్దగా ఉపయోగం లేద నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేరళ తరహాలో గ్రాడ్యుయేషన్ వరకు ‘ఉచిత విద్య’ను అందించాలి కానీ ‘ఉచిత బస్సు సౌకర్యం’ లాంటి ఉచిత అనుత్పాదక పథకాలు ఎందుకనే ప్రశ్నలు పెరిగిపోయాయి. ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయటానికి 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయనేది ఒక అంచనా. కానీ గత బడ్జెట్‌లో గ్యారంటీల అమలుకి ప్రభుత్వం 56 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్లు నాలుగువేల రూపాయలకు పెంచితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం హామీ ఇచ్చి రెండు సంవత్సరాలవుతున్నా పెన్షన్లు పెంచకుండా పండుటాకులను, మహాలక్ష్మి పథకాన్ని అమ లు చేయకుండా నారీమణులను మోసం చేస్తూనే వస్తున్నది.
కొలువుల కోసం కొట్లాటేనా?
తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టు నిధులు-, నీళ్లు, - నియామకాలు. రాష్ర్టం వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఉద్య మ నాయకత్వం నమ్మబలికి యువతని రా ష్ట్ర సాధన ఉద్యమంలో ముందు నిలబెట్టి బలిదానాలతో రాష్ట్రాన్ని సాధించుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పట్ల నాటి ప్రభుత్వం, నేటి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో పెద్దగా మార్పు లేదు. నిరుద్యోగ యువతని మభ్యపెట్టడం చూస్తుంటే కొలువుల కోసం మరొక ఉద్యమానికి యువత సమాయత్తమవుతున్నట్లు గానే కనిపిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి వేదికపై ఎండగడుతూనే వచ్చింది. కానీ ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో మాత్రం నిరుద్యోగ యువతను సంతృప్తి పరచలేకపోతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాల భర్తీలో వైఫల్యం, మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీలో వైఫల్యం, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 80వేల ఉద్యో గ ఖాళీలను ఇప్పటికీ భర్తీ చేయలేకపోవటం ప్రభుత్వం వైఫల్యమే.
కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేల ఉద్యో గాలు భర్తీ చేశామని చెప్పడం, ఎల్బీ స్టేడియంలో తలలు లెక్క పెడదామని ప్రభుత్వా ధినేతలు ఛాలెంజ్ చేయడం సిగ్గుచేటు. ఎం దుకంటే గత ప్రభుత్వం విడుదల చేసిన ఉ ద్యోగ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా రేవంత్ సర్కార్ ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాల్సిన అవసరముంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తూ ఐదు సంవత్సరాలలో భర్తీ చేస్తామని మాట్లాడటం నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుంది.
పెరగని ఆదాయం..
కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ప్రభుత్వం వైఫల్యం చెందటమే కాదు దుబా రా వ్యయం పెద్ద ఎత్తున పెరిగిపోతున్నది. దీనివల్ల ప్రభుత్వం ప్రతినెలా ఐదు నుంచి పదివేల కోట్ల రూపాయల అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి చెప్తున్నారు. తమ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి విలువైన ప్రభుత్వ భూములు అమ్మడం, అప్పులు తేవడం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపా యలు అప్పుచేసి గత ప్రభుత్వ అడుగు జాడల్లోనే నడుస్తున్నట్లుగానే కనిపిస్తున్నది.
తమ ఆదాయాన్ని పెంచుకోలేకపోవడం వల్ల సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడం, ఉద్యోగులకు డీఏలు ఇవ్వలేకపో వడం, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిల్లోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు పర్యాయాలు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంవోయుల ద్వారా; అమెరికా, సింగపూర్, దక్షిణకొరియా, జపాన్ పర్యటనల ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు, హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా 5.75 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయని గొప్పగా ప్రకటించుకున్నారు.
కానీ పెట్టుబడులు ఒప్పందాలు దాటి గ్రౌండ్‌వర్క్ జరగకపోవడంతో ఈ విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. దేశంలోనే అత్యధికంగా 30 వేల హెక్టార్ల పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ల్యాండ్ బ్యాంకు ఉన్న తెలంగాణ 56వ దా వోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించడంలో విఫలమైంది.
అపహాస్యం..
ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన సందర్భంలో, నైనీ టెండర్ల విషయంలో, మం త్రుల వ్యవహార శైలి వివాదాస్పదమైనప్పు డు, ఆంధ్రతెలంగాణ మధ్య నీటి పంపకాల వివాదం తలెత్తినప్పుడు, ప్రభుత్వ విధా నాలపై చర్చ జరగవద్దని ప్రభుత్వం భావించినప్పుడు.. కాళేశ్వరంపై విచారణ, ఈ రేస్ పై విచారణ, ఫోన్ టాపింగ్‌పై విచారణ వంటి అంశాలను తెరపైకి తెచ్చి విషయాన్ని పక్కదారి పట్టించే రాజకీయాలు తెలంగాణలో సర్వసాధారణమైపోయినాయి.
గత పాలకుల వైఫల్యాల మాటున తన పాలనా వైఫల్యాలను దాచే ప్రయత్నం ఎంతకాలం సాగుతుంది? ఉద్యమ నేలపై రాజకీయ జిమ్మిక్కులు ప్రజలు పసిగట్టలేరా! తెలంగాణ జాతిపిత అంశంపై ‘ఎవడికి రా నీవు జాతిపిత’ అని ప్రభుత్వాధినేత స్పందించిన తీరు చూస్తుంటే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా సంయమనం కోల్పోయి మాట్లాడు తూ తెలంగాణ ప్రతిష్టను అపహస్యం చేస్తున్నారనే భావన కలుగుతున్నది.
వ్యాసకర్త సెల్: 9885465877