08-02-2026 12:00:00 AM
కోలాహలం రామ్ కిశోర్ :
ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సామాజి క వర్గాలపై తీవ్ర ప్రభావం చూపి న అంశాల్లో ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ అంశం ఒకటి. లైంగిక దోపిడీ, బాలల అక్రమ రవాణా, శక్తివంతుల రహస్య నెట్‌వర్కులు, న్యాయవ్యవ స్థల వైఫల్యాలు ఇవన్నీ ఒకేచోట బయటపడడం ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను అంతర్జాతీయంగా సంచలనంగా మార్చేసింది. అమెరికా నుంచి యూరప్ వరకూ మీడియా, పౌరసంఘా లు, మానవ హక్కుల సంస్థలు ఈ అంశాన్ని తీవ్రంగా చర్చిస్తున్నాయి. అమెరికాలో జెఫ్రీ ఎప్‌స్టీన్ అరెస్టు, ఆపై అతని అనుమానాస్పద మరణం జరిగినప్పటి నుంచే కేసులో అనుమానాలు పెరిగిపోయాయి.
కానీ తా జాగా బయటకు వచ్చిన కోర్టు డాక్యుమెం ట్లు, సాక్ష్యాలు, ఈ-మెయిల్స్, ప్రయాణ వివరాలు ‘ఎప్‌స్టీన్’ ఒక వ్యక్తి మాత్రమే కాద ని, అతడు కేంద్రంగా పనిచేయడం వెనుక ఒక విస్తృతమైన శక్తివంతుల వలయం ఉందని ప్రపంచానికి స్పష్టంచేశాయి. రాజకీయ నాయకులు, బిలియనీర్లు, కార్పొరేట్ అధినేతలు, హాలీవుడ్ ప్రముఖులు ఇలా అనేక రంగాలలో ప్రముఖుల పేర్లు ఈ ఫైల్స్ లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రస్తావనకు రావడం అమెరికా సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
అధికార దుర్వినియోగం..
జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక నేరాల కేసు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు ముఖ్యంగా ఉన్నత వర్గాల దోపిడీని ఎత్తిచూపింది. అమెరికా న్యాయశాఖ, ఎఫ్‌బీఐ సంయుక్తంగా నిర్వహించిన సుదీర్ఘ దర్యాప్తులో నిర్దిష్ట క్లయింట్ జాబితా లేదా బ్లాక్‌మెయిల్ ఆధారాలు లభించలేదని నివేదించినప్పటికీ, ఈ కేసులో ముఖ్యంగా ప్రస్తు త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వ్యా పార దిగ్గజం బిల్ గేట్స్, దివంగత దిగ్గజం మైకేల్ జాక్సన్ సహా పెద్ద తలల పేర్లు ప్రస్తావనకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. దర్యాప్తులో ఇంకా లక్షలాది పత్రాలు ఉన్నాయని, అవి వెలికి తీయాలనే డిమాండ్లు ప్ర జల నుంచి పెరిగిపోతున్నాయి.
అంతేకాదు అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ప్రధాన పత్రికలు దీనిపై లోతైన కథనాలు రాశాయి. ‘న్యూయార్క్ టైమ్స్’, ‘ది గార్డియన్’, ‘వాషింగ్టన్ పోస్ట్’ వంటి పత్రికలు ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను ప్రపంచానికి ఒక తెలియని చీకటి కోణాన్ని పరిచయం చేశా యి. న్యాయవ్యవస్థ, పారదర్శకత, ధనిక-, పేద మధ్య న్యాయం, అసమా నతకు ఉదాహరణగా ఈ పత్రికలు తమ కథనంలో విశ్లే షించాయి. పౌరహక్కుల కార్యకర్తలు ‘ఇది కేవలం లైంగిక నేరాల అంశం మాత్రమే కా దు; అధికారాన్ని దుర్వినియోగం చేసే గ్లోబ ల్ ఎలైట్ వ్యవస్థను బయటపెట్టే క్షణం’గా పేర్కొనడం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో బాధితులకు న్యాయం కోరుతూ ‘జస్టిస్ ఫర్ విక్టిమ్స్’ అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. యూరప్‌లోనూ ఇదే స్పందన కనిపించింది. ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఎప్‌స్టీన్ వ్యవహారం మహిళల భద్రత, బాలల రక్షణపై ఉన్న చట్టాల ప్రభావాన్ని పున:పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు కూడా మానవ అక్రమ రవాణా వ్యతిరేక చర్యల్లో అంతర్జాతీయ సహకారం ఎంత కీలకమో ఈ ఉదంతం చూపించిందని వ్యాఖ్యానించాయి.
భారతీయుల పేర్లు?
ప్రపంచమంతటా ఎప్‌స్టీన్‌పై ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ భారతీయ ప్రధాన మీడియా ఈ అంశంపై పెద్దగా దృష్టి సారించడం లేదనిపించింది. కొన్ని ఆన్‌లైన్ పోర్ట ల్స్ లేదా స్వతంత్ర జర్నలిస్టులే తప్ప, టెలివిజన్ చర్చలు గానీ, ప్రధాన పత్రికలు ‘ఎప్ స్టీన్ ఫైల్స్’ను గంభీరంగా తీసుకున్న దాఖలాలు తక్కువగానే ఉన్నది. అయితే దీనికి కారణం ఏంటన్నది పక్కనబెడితే, ప్రపంచాన్ని కదిలించిన ఒక అంశం ఎందుకింత సంచలనం అయిందన్న విషయం మన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుంది. ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసు మనకు సంబంధం లేకపోవడం వాస్తవమే కావొ చ్చు, కానీ ఇలాంటి కుంభకోణాలు మన దగ్గర వెలుగు చూసినప్పుడు పాశ్చాత్య దేశాల్లోని మీడియా సంస్థలు పనిగట్టుకొని వార్త లు రాస్తూ ప్రపంచమంతటా సమాచారాన్ని చేరవేస్తున్నాయి. అలాంటప్పుడు భారత్ కూడా ఇలాంటి కుంభకోణాలను మన ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా వివ రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయి తే ఈ కేసులో భారత్‌కు చెందిన కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తున్నాయి. ఒకప్పుడు వ్యాపారవేత్తగా వెలుగొందిన రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఆయనకు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాలను ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ సంచలన నివేదిక ప్రచురించింది.
అనిల్ అంబానీ, ఎప్‌స్టీన్ మధ్య సందేశాలు 2017 ప్రారంభం నుంచి 2019 వరకు కొనసాగినట్టు పత్రాలు చూపిస్తున్నట్లు తెలిపింది. అని ల్ అంబానీతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖల పేర్లు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.
ప్రపంచానికి హెచ్చరిక..
ఇక ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ ప్రపంచానికి ఒక కఠినమైన నిజాన్ని రుచి చూపించింది. ధనం, అధికారం కలిసినప్పుడు న్యాయం ఎంత సులభంగా అణచివేయబడుతుందనేది వివరించింది. అదే సమయంలో న్యాయ వ్యవస్థలు, మీడియా, ప్రభుత్వాలు స్వతంత్రంగా పనిచేయకపోతే, బాధితుల గొంతు లు ఎంత సులభంగా మూగబోయే అవకాశముంటుందో కూడా కళ్లకు కట్టినట్లుగా బహిర్గతం చేసింది. అందుకే పాశ్చాత్య దేశా ల్లో ఈ ఎప్‌స్టీన్ ఉదంతాన్ని ఒక కుంభకోణంలా కాకుండా వ్యవస్థాపక వైఫల్యంగా చర్చకు తెరలేపాయి. 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశం లో మీడియా పాత్ర మరింత కీలకం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా, మానవ హక్కు లకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేయడం, ప్రజలను అవగాహన కల్పించడం మీడియా బాధ్యత. ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ మనకు ఒక హెచ్చరిక. న్యాయం అనేది ధనికుల ఇంటి ద్వారంలో ఆగిపోకూడదు. నింది తులు చేతిలో మోసపోయిన బాధితుల కథలు దేశాల సరిహద్దులు దాటి ప్రతీఒక్కరి మనసుల్లో ప్రతిధ్వనించాలి. ప్రపంచం ఈ కుంభకోణాన్ని ఒక మలుపుగా తీసుకుంటే, భారత మీడియా మాత్రం చూసీ చూడనట్టుగా వ్యవహరించింది. ఇది భవిష్యత్తుకు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో విజ్ఞానం, వివేచన గల మేధావులు సైతం మౌనంగా ఉండటం రాజకీయ వైఖరే కావచ్చు. కానీ అది అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పేరొందిన భారత్‌లో మీడియా ప్రపంచ విషయా లను పట్టకుండా ఎవరికీ అనుకూలంగా పనిచేస్తుందనేది ఆలోచించాల్సిన అవసర ముంది.
వ్యాసకర్త సెల్: 9849328496