15 April, 2026 | 12:28 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

27-05-2025 12:56 AM

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్, మే 26 (విజయ క్రాంతి): ప్రజల నుంచి ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలను ప్రజల నుంచి విజ్ఞప్తిలో స్వీకరించారు.

అధికారులు తమ పరిధిలో తీర్చలేక సమస్యలకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయ పరుస్తూ దరఖాసుదారులకు దిశా నిర్దేశం చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా 122 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించి వచ్చాయి.

అనంతరం జిల్లా స్థాయి అధికారులతో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి మధుసూదన్ రాజ్, డిసిఓ వెంకటేశ్వర్లు, సిపిఓ సుబ్బారావు, డి ఏ ఓ విజయ నిర్మల, డిపిఓ హరిప్రసాద్, మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ డిహెచ్‌ఓ మరియన్న, గ్రౌండ్ వాటర్ డిడి సురేష్,  వివిధ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.