27-05-2025 12:58:35 AM
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ, మే 26 (విజయ క్రాంతి) : పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంచినీళ్లు, సాగునీరు, రైతుబంధు, రైతు బీమా, పింఛన్, కళ్యాణి లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఇస్తే.. ఇప్పుడున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ పోయాయి.. కేవలం అందాల పోటీలు ఒక్కటే వచ్చిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. రూ.6 కోట్ల మైంటెనెన్స్ బిల్లులు ఇవ్వలేని దౌర్భగ్యమైన పాలన రాష్ట్రంలో కొనసాతుందని తీవ్రంగా విమర్శించారు.
సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జనగామ పట్టణ కేంద్రంతో పాటు జనగామ రూరల్, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాలకు సంబంధించిన 82 మంది లబ్ధిదారులకు రూ.20.46 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ లబ్ధిదారులు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను సకాలంలో బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని సూచించారు. వైద్యం విషయంలో ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా తమ నీలిమ హాస్పిటల్ సేవలు కూడా ఉపయోగించుకోవాలన్నారు. జనగామలో సిటీ స్కాన్ లేకపోతే వచ్చే ప్రయత్నం చేసానని తెలిపారు . రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణి చేసింది జనగామ నియోజకవర్గంలోనేని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్న వారందరికీ ఏడాదిన్నరగా ఆర్థికంగా చితికిపోకుండా తన ప్రయత్నం చేస్తున్నా.. మిగితా మూడున్నర సంవత్సరాలు కూడా మీ అందరిని కాపాడుకుంటానని పల్లా హామీ ఇచ్చారు. కేసీఆర్ పదేళ్లలో 11సార్లు రైతుబంధు వేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రూ.6 కోట్ల మైంటెనెన్సు బిల్లులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇదని విమర్శించారు.
2 నెలలు మోటార్లు బంద్ పెట్టి.. ఉన్నా నీళ్లు తెచ్చుకోలేని తెలివి లేని ప్రభుత్వం ఇదన్నారు. 6 కోట్ల పైసల్ లేవు కానీ.. అందాల పోటీలకు మాత్రం పైసల్ ఉన్నాయాట..? ఎంత సిగ్గు పడాలి.. ఈ అందాల పోటీలు ఎవరి కోసం.. ఎందు కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. విషయాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలని బీఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. కార్యక్రమంలో జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ పోకల జమున, తదితర నాయకులు పాల్గన్నారు.