17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

27-05-2025 12:54 AM

హనుమకొండ కలెక్టర్ పీ. ప్రావీణ్య

హనుమకొండ, మే 26 (విజయ క్రాంతి): రానున్న వ ర్షాకాలం నేపథ్యంలో సంబంధిత శాఖల  అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల అధికారులతో వరద ముప్పు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్, పోలీస్, అగ్నిమాపక, వ్యవసాయ, ఆర్ అండ్ బి, తదితర శాఖల అధికారులు రానున్న వర్షా కాలంలో ఆయా శాఖల తరఫున తీసుకుంటున్న చర్యల గురించి జిల్లా కలెక్టర్ కు వివరించారు.  జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  రానున్న వర్షాకాలం నేపథ్యంలో  ముంపు ప్రాంతాలను అధికారులు ముందస్తుగా గుర్తించాలని సూచించారు.

ముంపు ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. రోడ్లు తెగిపోయే ప్రాంతాలను ఆ శాఖ అధికారులు ముందస్తుగానే గుర్తించాలన్నారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాలలో వర్షపు నీరు కారణంగా రాకపో కలకు ఇబ్బందికరంగా మారే ప్రాంతాలను గుర్తించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సరిపోను మందులు నిల్వలు ఉంచాలని పేర్కొన్నారు. వ్యాధులు ప్రభలే అవకాశాలున్నచోట్ల వైద్య శిబిరాలు నిర్వహించేలా సిద్ధంగా ఉండాలన్నారు.

వర్షాకాలం నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలన్నారు.  ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.  డిసిపి సలీమా, ఇన్చార్జి కలెక్టర్ వై వి గణేష్, మేన శ్రీను, సిపిఓ సత్యనారాయణరెడ్డి, డీఏవో రవీందర్ సింగ్, డిపిఓ లక్ష్మి రమా కాంత్, డిఎంహెచ్‌ఓ  అప్పయ్య, ఆర్డిఓ కే నారాయణ, అధికారులు పాల్గొన్నారు.