27 June, 2026 | 7:08 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంఘాలతో సమావేశం

09-03-2026 12:32 AM

గాంధారి, మార్చ్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గ్రామ మహిళ సంఘం కార్యాలయంలో జడ్పీ సీఈవో చందర్ నాయక్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల  కార్యక్రమంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో చందర్ నాయక్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు , స్త్రీ నిధి రుణాలు పెండింగ్ లేకుండా చూసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీఓ లక్ష్మీ నారాయణ, సీసీ గొర్రె రాములు, విఓఎ లక్ష్మీ ప్రియ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.