13-11-2025 12:00:00 AM
నాసిరకం సరుకులతో పదార్థాలు
చూసీ చూడనట్టు అధికారుల తీరు
చెలరేగుతున్ననిర్వాహకులు
మెట్ పల్లి, నవంబర్12(విజయక్రాంతి)మెట్ పల్లి డివిజన్ పరిధిలోని మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని హోటల్స్, టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్ లలో ఆహార పదార్థాల తయారీలో నాసిరకం సరుకులు ఉపయోగిస్తూ నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత కరువావడంతో గాలిలో దీపంల ప్రజల ఆరో గ్యం మారుతోంది.
పట్టణ పరిధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో హో టళ్లు, రెస్టారెంట్ లు, ధాబాలు, వెలుస్తుండగా ఇక టిఫిన్ సెంటర్లు పుట్టగొడుగుల్ల పు ట్టుకోస్తున్నాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్ల ని ర్వాహకులు నిబంధనలు తుంగలో తొక్కి నాణ్యత లేని ఆహార పదార్థాలు అమ్ముతు సొమ్ము చేసుకుంటున్నారు. దింతో ప్రజలు రోగాలబారిన పడి ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారు.
మెట్ పల్లి డివిజన్ ఏర్పాటు అనంతరం వివిధ అవసరాల నిమిత్తం పట్టణానికి ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండ లాలతో పాటు నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి, మోర్తాడ్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలాల నుండి నిత్యం వెల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. వారు తమ పనుల సమయంలో టిఫిన్ తో పాటు భోజనం చేస్తున్నారు.నాణ్యత లేని ఆహారం తిన్న వారు అనారోగ్యం పాలు అవుతున్నారు.
ఇక రెస్టారెంట్ లు స్వీట్ హౌస్ లను అడిగేవారు కరువాయ్యారు. అధికారులు అపుడప్పుడు చేపడుతున్న తూ తూ మంత్రపు తనిఖీల్లో కుళ్లిన మాంసం, బూజు పట్టిన పదార్థాలు బయట పడుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్ లలో రోజుల తరబడి ఫ్రిజ్ ల్లో నిలువ ఉంచడంతో అవి కుళ్లి పోయి దుర్వాసన వస్తున్నాయి. అయిన ఆ ఆహార పదార్థాలపై ప్రత్యేక మసాలాలు చల్లి నూనెలో వేయించి ప్రజలకు అంటాగట్టి సొమ్ము చేసుకుంటున్నారు.హోటళ్లు, రెస్టారెంట్ లలో వంట మాస్టర్ లు, సర్వర్లు ప్రత్యేక దుస్తులు ధరించాల్సి ఉంటుంది.
అలాగే స్వీట్ హౌస్ లలో తినుబండరాలు నాణ్యత కారువవగా లడ్డులు, గులాబ్ జామ్ లు, మైసూర్ పాక్ లతో పాటు ఇతర తీపి పదార్థాలు కాలం చెల్లినవి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆహార పదార్థాల తనిఖీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమ వ్యాపారులకు వరంగా మారింది.వంట గదుల పరి శుభ్రపై చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు హోటళ్లు, రెస్టారెంట్, స్వీట్ హౌస్ లపై నిత్యం తనిఖీలు చేపట్టి ప్రజల ఆరోగ్యం రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
హోటళ్లు, రెస్టారెంట్‌లు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్ లు, టిఫిన్ సెంటర్లు, ప్రజలకు ప్రతి రో జు నాణ్యమైన ఆహార పదార్థాలు అం దించాలి. ప్రజలు ఆహార పదార్థాల నా ణ్యతపై అనుమానాలు వచ్చి పిర్యాద్ చే స్తే, అలాంటి హోటళ్లు రెస్టారెంట్ లపై దాడులు చేసి కఠిన చర్యలు తీసుకోని వాటినిముసివేస్తాము.
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి.మోహన్