calender_icon.png 13 November, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధులకు డుమ్మా.. అడిగేవారెవరమ్మా..!

13-11-2025 12:00:00 AM

  1. ఎఫ్‌ఆర్‌ఎస్ వేసి.. అటునుంచి అటే సొంత పనులకు..

భల్లు తండా పంచాయతీ కార్యదర్శి నిర్వాకం

గ్రామంలో ఏ పని చేయమన్నా నిధులు లేవంటున్నాడంటూ ఆరోపణలు

మోతె, నవంబర్ 12 :  ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం జీతం కొరకు మాత్రమే చేసేది అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఉద్యోగులు. విధులకు డుమ్మా.. అయినా అడిగేవారెవరమ్మా.. అన్నట్లుగా నడుచుకుంటున్నారు. సరిగ్గా ఇదే విధానంను మండలంలోని ఓ తండా పంచాయతీ కార్యదర్శి అనుసరిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. మండలం లోని భల్లుతండా గ్రామ కార్యదర్శి ఉదయం గ్రామపంచాయితీ కార్యాలయానికి వచ్చి యాప్ లో ఫేస్ రికగ్నిషన్ వేసి తదుపరి కార్యాలయానికి తాళం వేసి వెళ్ళిపోయాడు.

అయితే కార్యదర్శి కార్యాలయ పనులకంటే సొంత పనులకు ప్రాధాన్యత నిస్తున్నాడని భల్లుతండా గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అనేకసార్లు ఇలానే చేశాడంటూ చెబుతున్నారు. బుధవారం కార్యాలయానికి పనుల నిమిత్తం పలువురు వెళ్లగా కార్యాలయానికి తాళం వేసి ఉన్నట్లు చెప్పారు. ఇదే విషయం పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సమస్యల గురించి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వీధి దీపాలు వెలగడం లేదని తండా వాసులు కారు చీకట్లో మగ్గుతున్నారని చెప్పిన నిధులు లేవనే చెబుతూనే వస్తున్నారన్నారు.

పై అధికారులకు సమాచారం ఇవ్వకుండానే తనకు నచ్చిన పద్ధతిలో సమయం పాటించకుండా ఉదయం వచ్చి రిజిస్టర్ లో సంతకం పెట్టి మరి వెళ్ళి పోతున్నాడని గ్రామస్తులు తెలియ జెస్తున్నారు. వీధులలో చెత్త పేరుక పోయిన పట్టించుకోవడంలేదని, చెత్త సేకరణకు  ట్రాక్టర్ తిప్పడం లేదని, మురుగు కాల్వలలో మురుగు పేరుకొనిపోయినా పట్టించుకున్న పాపాన పోవడంలేదని చెప్పారు..

గ్రామ కార్యదర్శి గ్రామానికి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళతాడో ఎవరికీ అర్ధం కావడం లేదని గ్రామస్థులు చెపుతున్నారు. కాగా పంచాయతీ కార్యదర్శి కార్యాలయంలో లేకపోవడంపై యం పి డి ఓ  ఆంజనేయులును వివరణ అడుగగా భల్లు తండా గ్రామ కార్యదర్శి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు.