నాయకన్ గూడెంలో ‘పుచ్చలపల్లి’ వర్ధంతి
కూసుమంచి, మే 19(విజయక్రాంతి): మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో సిపిఎం పార్టీ అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని మంగళవారం ఉపాధి కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం గ్రామశాఖ కార్యదర్శి కర్ణబాబు మాట్లాడుతూ.. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని ఆలోచనలు మోడీ ప్రభుత్వం ఉందని, ఉపాధి హామీని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
జాతీయ ఉపాధి హామీ పేరుతోనే పనులను కొనసాగించాలని, పని ప్రదేశంలో రెండుసార్లు హాజర్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతి ఉపాధి హామీ కార్మికులకు రోజుకు రూ.600 ప్రభుత్వం అందజేయాలని, పని ప్రదేశంలో కార్మికులకు సరైన సౌకర్యాలను కల్పించాలని, ఉపాధి పనిముట్లను ప్రభుత్వం అందజేయాలని పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కంచర్ల జగన్మోహన్ రెడ్డి, గడ్డం మురళి, సింగం సోమయ్య, సింగం కృష్ణంరాజు, పార్టీ సానుభూతిపరులు, ఉపాధి హామీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.






