భానుడి భగభగ
- ఎండలతో అల్లాడుతున్న ప్రజలు
- ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
హైదరాబాద్/మహబూబాబాద్, మే 19 (విజయక్రాంతి): దేశ రాజధాని ఢిలీతో పాటు పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్ర తలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా నమోదయ్యా యి. రాబోయే మూడు రోజులు కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉంది.
వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, చల్లని గాలుల లేమి, వేడి గాలుల ప్రభావం కారణంగా ఢిల్లీలో హీట్‌వేవ్ పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే కొన్ని రోజుల పాటు ఉపశమనం కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్ల డించారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిం ది.
తెలంగాణలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రంలో కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థా యిలో నమోదయ్యాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైం ది. అదే విధంగా నల్లగొండ జిల్లా కట్టంగూర్, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్, సిద్దిపేట జిల్లా కోహెడ్‌లలో 45.8 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో 45.7 డిగ్రీలుగా నమోదైంది.
అదిలాబాద్‌లోని సిర్పూర్ ప్రాంతాల్లో 45.6 డిగ్రీలు, ఖమ్మం ఏనకూరు, సూర్యాపేట మట్టంపల్లి ప్రాంతాల్లో 44.8 డిగ్రీలు, మెదక్ నర్సాపూర్, యాదాద్రి అడ్డగూడురులలో 44.5 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా భానుడి తా పంతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బుధ, గు రువారాల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురు స్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అంతేకాకుండా ఈ రోజుల్లో వర్షాలతోపాటు వడగాల్పులు కూడా వీస్తాయని పేర్కొంది. ఈనెల 22 నుంచి 24 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సైతం హెచ్చరించింది. మంగళవారం జగిత్యాల జిల్లాలో 45.9 డిగ్రీలు, నల్లగొండ, నిర్మల్, సిద్దిపేట్ జిల్లాలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవా రం ప్రచండ భానుడు ఉగ్రరూపాన్ని చూపా డు. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, భూపాలపల్లిలో 42.4 వరంగల్ లో 40.7, హనుమకొండలో41.2, ములుగులో 42.1, జనగామలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతతో జన సంచారం లేక రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.






