29 June, 2026 | 2:00 AM

వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు

29-06-2026 12:00 AM

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

వెల్దుర్తి, జూన్ 28 : నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అదివారం వెల్దుర్తి మండల కేంద్రం లో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని  నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాజిరెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.