9 April, 2026 | 2:22 AM

పారిశుద్ధ్యంలో సమయపాలన పాటించాలి

09-04-2026 12:21 AM

మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

జవహర్‌నగర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్కిళ్లలో పారిశుద్ధ్య నిర్వహణలో సమయపాలన పాటించాలని ఇంటి పన్నుల విషయంలో వేగం పెంచి అనుకున్న లక్ష్యాలను సాధించాలని, పచ్చదనానికి నిలయా లుగా ప్రభుత్వ పార్కులు నిలుస్తున్నాయని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

మల్కా జిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ యాప్రాల్ వార్డులో బుధవారం కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, కీసర డిప్యూటీ కమిషనర్ వసంతతో కలిసి యా ప్రాల్ వార్డు నందు శానిటేషన్, టౌన్ ప్లా నింగ్, ఇంజనీరింగ్, పార్కులు తదితర పనులను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ప్రాంతాలలో ఇంటి పన్నులు వసూళ్లలో వేగం పెంచాలని, ప్రజలకు సరియైన అవగాహన కల్పిస్తూ, పారిశుద్ధ్య నిర్వహణ టౌన్ ప్లానింగ్ శానిటేషన్ తదితర కార్యక్రమాల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత, శానిటేషన్ డి ఈ మాధవాచారి, ఏఎంసీలు వెంకటేష్, శ్రవణ్, గంగన్న, మధుసూదన్ రెడ్డి, నగేష్ బాబు, యు సి డిపార్ట్మెంట్, ఏసిపి శ్రీనివాస్, టి పి ఎస్ స్రవంతి, ఇంజనీరింగ్, ఏఈలు, సర్కిల్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.