8 May, 2026 | 4:05 PM

కొనుగోళ్లు వేగవంతం చేయాలి

08-05-2026 03:13 PM

చెన్నూర్, (విజయక్రాంతి):  వడ్ల కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని బిఆర్ఎస్ కోటపల్లి  మండల సోషల్ మీడియా కన్వీనర్ ఆసంపల్లి సంపత్  డిమాండ్ చేశాడు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి  మండలంలోని దేవులవాడ కొనుగోలు కేంద్రాన్ని  సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అకాల వర్షాలతో రైతులు నష్టాల బారిన పడిన తర్వాత కూడా అధికారుల్లో స్పందన కనిపించకపోవడం దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు  ఒక్క లారీ లోడ్ ధాన్యం కూడ  తరలించలేదన్నారు. మాటలే తప్పా రైతుల బాధలు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థతి ఏర్పడిందన్నారు.