పుష్పకు సినీ ప్రముఖుల పరామర్శ
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ దుర్మరణం పాలైన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు. అల్లు అర్జున్ నివాసా నికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకునిఆయనను పరామర్శిస్తున్నారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ.. ఆయన ఇంటికి రాగానే హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి సతీమణి సురేఖ సైతం మేనల్లుడిని చూడగానే ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
దర్శకుడు సుకుమార్ వచ్చీరాగానే అల్లు అర్జున్‌ను హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన వారిలో దర్శకులు కె.రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి, దిల్ రాజు, నటులు దగ్గుబాటి రా నా, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, ఉపేంద్ర, ఆర్ నారాయణమూర్తి తదితరులు ఉన్నారు.






