రాజకీయ స్వార్థం కోసమే కాంగ్రెస్ పార్టీ పై పుట్టమధు అసత్యపు ఆరోపణలు
10-06-2025 09:52 AM
మంథని లో విలేకరుల సమావేశంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు
మంథని, (విజయక్రాంతి): రాజకీయ స్వార్థం కోసమే కాంగ్రెస్ పార్టీ పై పుట్టమధు ఆ సత్యపు ఆరోపణలు చేస్తున్నారని మంథని లో విలేకరుల సమావేశంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంథని పట్టణంలో వారు విలేకరుల సమావేశంలో యూత్ నాయకులు ఎరుకల ప్రవీణ్, సాదుల శ్రీకాంత్, నాయకులు కుడుదుల వెంకన్న, ఆర్ల నాగరాజు మాట్లడుతూ... మేడిగడ్డ సంఘటన చాలా దురదృష్టకరమని, సరదాగా ఈతకు వెళ్లి గల్లంతైన బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకులు పుట్ట మధు ఈ సంఘటనను కూడా రాజకీయంగా వాడుకోవడం బాధాకరమన్నారు.
ఈ సంఘటన తెలుసుకున్న రాష్ట్ర మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ఘటనస్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇచ్చి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని, ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. రెడ్డి చెరువులో మట్టి తీసి డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నారని అసత్య ఆరోపణలు చేయడం కాదని, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే రుజువు చేయాలని సవాల్ విసిరారు. మా నాయకులపై అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దొరగోళ్ళ శ్రీనివాస్, దాది క్రాంతి, ఎరుకల సురేష్ పాల్గోన్నారు.






