15 April, 2026 | 10:14 AM

ఘనంగా పివి రావు జయంతి

12-05-2025 01:23 AM

నిర్మల్, మే 11  ( విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలోనీ టీఎన్జీవో  సంఘ భవనంలో మాల సంఘాల ఐక్యవేదిక  ఆధ్వర్యంలో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు  జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముం దుగా పివి రావు  చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. పలువురు మాల సంఘల నాయకులు మాట్లా డుతూ పివి రావు ఆశయాలను నెరవేర్చాలని అన్నారు.

మాల సోదరీ సోదరులంద రూ పివి రావు  అడుగుజాడల్లో నడవాలని కొనియాడారు జై పివి రావు జై జై పివి రావు, పివి రావు అమర్ రహే, పివి రావు  ఆశయాలను కొనసాగించాలి, జై మాల జై జై మాల, జై భీమ్ జై జై భీమ్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు వెలుమల ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు డి రాములు,

తెలంగాణ రాష్ట్ర అంబే ద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల  వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఈరోల పురుషోత్తం, మైనారిటీ నాయ కులు మొయినుద్దీన్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రోహిదాసు నాయక్, నాలుగవ తరగతి ఉద్యోగుల సం ఘం జిల్లా అధ్యక్షులు బొంబాయి రవి, విన య్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.