సైనికుల కోసం ఎమ్మెల్యే పూజలు
నిజామాబాద్ మే 11: (విజయక్రాంతి): ఆపరేషన్ సింధుర్ భారత పాకిస్తాన్ మధ్య జరుగుతున్నా యుద్ధం నేపథ్యంలో భారత త్రివిధ దళాల సైన్యానికి మనోధైర్యం ప్రసాదించాలని, భారత భూబాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని. ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మల్లారం దత్త గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఈ యుద్ధంలో భారత్ సైన్యనికి, భారత భూబాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా కుల, మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు దగ్గర్లో ఉన్న మందిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని మళ్ళీ భారత్ పై దాడులు చేయడం పాకిస్తాన్ వంకర బుద్ది, ప్రపంచదేశాలకు స్పష్టం అయిందన్నారు.
భారత్ సైన్యం తలుచుకుంటే పాకిస్తాన్ ను ఇండియా పఠంలో లేకుండా చేస్తుందని భారత దేశ ప్రజలందరు మోదీ గారికి కేంద్రప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం సాధించి ఉగ్రవాదుల నెత్తుటితో భారత మాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సిందూర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






