03-12-2024 02:05:13 AM
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంత్రి): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పెళ్లి పీటలెక్కనున్నారు. ఆమెకు హైదరాబాద్‌కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో వివాహం నిశ్చయమైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఈ నెల 22న వీరి వివాహ మహోత్సవం జరుగనున్నది. ఇదే నెల 24న హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీలో వారి రిసెప్షన్ జరుగనున్నది.
వివాహంపై ఆమె తండ్రి పీవీ రమణ మాట్లాడుతూ..‘వెంకట దత్తసాయి కుటుంబంతో మాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. గత నెలలో సింధు వివాహంపై ఒక నిర్ణయానికి వచ్చాం. జనవరి నుంచి ఆమె షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈనెలలోనే పెళ్లి చేయాలనుకున్నాం’ అని పేర్కొన్నారు.