24 June, 2026 | 3:11 PM

Breaking News

ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మహేశ్వర్ రెడ్డి   •   నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •  

అంగరంగ వైభవంగా కళ్యాణం

03-04-2026 08:47 PM

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగాం గ్రామపంచాయతీ శివరాంపల్లిలో  శుక్రవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్దఎత్తున హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. గ్రామ పంచాయితీ తరుపున భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలలో జనగామ గ్రామ పంచాయతీతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఈ వేడుకలలో సర్పంచ్ మారిశెట్టి పద్మ, సూపక సర్పంచ్ కశెట్టి సతీష్, మాజీ ఎంపిటీసి మారిశెట్టి తిరుపతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.