మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్ మృతి
సారాకేరా జైలులో తీవ్ర అనారోగ్యం
భారీ భద్రత నడుమ రిమ్స్‌కు తరలింపు
మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యులు
కుషాయిగూడ, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): సీపీఐ (మావోయిస్టు) పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ (కిషన్ దా) అనారోగ్యంతో మృతి చెందారు. 75 ఏళ్ల వయసు లో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ జైలు కస్టడీ లో ఉండగా శుక్రవారం తుదిశ్వాస విడిచా రు. సారాకేలా జైలులోని బోస్ తీవ్ర అస్వస్థతకు గురికాగా శుక్రవారం ఉదయం 6 గంటలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ రిమ్స్ ఆ స్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృం దం ఆయనకు చికిత్స ప్రారంభించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు.
ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రశాంత్ బోస్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బోస్ 45 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆయన నక్సల్బరీ ఉద్య మ ప్ర భావంతో విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. సిద్ధాంతకర్తగా, వ్యూహకర్తగా పార్టీలో గుర్తిం పు పొందారు. నవంబర్ 12, 2021న జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాలో తన భార్య షీలా మరాండీతో కలిసి పోలీసులకు చిక్కారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్నా రు.
2004 సెప్టెంబర్ 21న పీపుల్స్ వార్, ఎంసీసీ వంటి విప్లవ వర్గాలను ఏకం చేసి సీపీఐ(మావోయిస్టు) పార్టీ ఏర్పాటులో ఆ యన కీలక పాత్ర పోషించారు. పార్టీ బలోపేతం, ఎర్రసైన్యం నిర్మాణంలో ఆయన కృ షి విశేషమని సహచరులు పేర్కొంటారు. జా ర్ఖండ్, బిహార్ సహా ఇతర రాష్ట్రాల్లో 200 కు పైగా ఘటనలకు ఈయన సూత్రధారిగా పో లీసులు పేర్కొంటారు. జైలులో వైద్యం అం దక పోవడంతోనే ఆయన మృతి చెందారనే ఆరోపణలున్నాయి. వృద్ధాప్యం, అనారో గ్యం వెంటాడుతున్నా, జైలులో ఉన్నప్పటికీ ఆయనలోని విప్లవ నిబద్ధత చివరి వరకు కొనసాగిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.




