గ్రూప్1లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలి
టీజీపీఎస్సీ ఆఫీసు ముట్టడికి బీజేవైఎం యత్నం
పోలీసుల రంగప్రవేశంతో తోపులాట, పలువురికి గాయాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి): నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో 1:100 ప్రకారం అభ్యర్థులను క్వాలిఫై చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు నిలువరించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తోపులాటకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాల య్యాయి. కొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గాయపడ్డ వారిని ఇతర కార్యకర్తలు ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ గ్రూప్ గ్రూప్ నోటిఫికేషన్‌లో అదనంగా పోస్టులను పెంచాలని కోరారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ జాబ్ కాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పవన్‌రెడ్డి, గణేష్, బోంగోని సురేష్, ఉపాధ్యక్షులు ప్రవీణ్, మహేష్ నామాని, కుమార్, లడ్డు, తరుణ్‌రెడ్డి, చితరంజన్‌రెడ్డి, ఇందిరాప్రియ, అనితారెడ్డి, కోమలినాయక్, సిరివెన్నెల తదితరులు పాల్గొన్నారు.






