10 June, 2026 | 2:43 AM

ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య

10-06-2026 01:26 AM

మహబూబాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వ బడిలో నిష్ణాతులైన ఉపా ధ్యాయుల పర్యవేక్షణలో తరతమ భేదాలు లేకుండా బడిలో చేరిన పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించడంతోపాటు, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, వసతి సౌకర్యాలు, మధ్యా హ్న భోజనం అందించడం జరుగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ ప్రభుత్వ విద్యాలయాల్లోనే చేర్పించాలని మహబూబాబాద్ జిల్లా విద్యాధికారి ఏ. సత్యనారా యణమూర్తి కోరారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 8వ వార్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాల 2024 25 విద్యా సంవత్సరంలో విద్యార్థులు లేరనే నెపంతో మూసివేయగా, ఆ పాఠశాలను తిరిగి ప్రారంభించడానికి టిపి జెఏసి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్, జేఏసీ నాయకులు కలిసి పాఠశాలలో చేర్పించే విధంగా తల్లిదండ్రులను అంగీకరింపజేయగా, 64 మంది విద్యార్థుల్లో, ఐదుగురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు సమ్మతి తెలియజేస్తూ పత్రాలను అందజేశారు.

మిగిలిన విద్యార్థులను కూడా పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లా డుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేపడుతు న్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వరరావు, జేఏసీ కన్వీనర్లు మైస శ్రీనివాసులు, షేక్ జానీ, జి సి డి వో గాయత్రి, సెక్టోరియల్ అధికారులు సురేష్, వెంకటేశ్వర్లు, హెడ్మాస్టర్ సిరి నాయక్, తదితరులు పాల్గొన్నారు.