17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పేదలకు నాణ్యమైన విద్య దూరం

24-06-2025 12:54 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకోవాలి
  2. రైతులకు నాణ్యమైన ఎరువులు అందేలా చూడాలి
  3. రాష్ట్రీయ లోక్‌దళ్ తెలంగాణ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): 2009లో కేంద్రప్రభుత్వం చేసిన విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు చేయ కపోవటంతో దాదాపు 9 లక్షల మంది ఎస్సీ, ఎసీ,్ట బీసీ, పేద విద్యార్థులు నాణ్యమైన ఉచితవిద్యను అందుకోలేకపోతున్నారని రాష్ట్రీ య లోక్‌దళ్ తెలంగాణ అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ తెలిపారు. సోమవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ లో దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టంపై రేవంత్‌రెడ్డి సర్కార్ వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్త న కంపెనీ, దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలకు పదునుపెట్టాలని, నకిలీ విత్తనాలని నిర్ధారణ అయితే వాస్తవ దిగుబడికి 3 రెట్లు రైతుకు దక్కేలా ప్రభుత్వ మే చెల్లించే హామీ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సకాల ంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరా రు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాఖలాలు లేకున్నా మంత్రులుగా పాలించే వారి హక్కుపై తాము ప్రశ్నించబోమని, ప్రజా తీర్పే తమ పార్టీకి శిరోధార్యమణి స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖనే ‘మా మంత్రులు కమీషన్ తీసుకుంటున్నారు’ అ న్న మాటలు మీడియాలో వచ్చినా తగిన చ ర్యలకు సీఎం చొరవ తీసుకోకపోవటం ఆక్షేపణీయమన్నారు.

ఆరోపణలపై విచారణ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాయాలని సీఎంకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా అభివృద్ధిలో గానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలోనే గానీ ఏమాత్రం ముందడుగు వేయలేదన్నారు. రెండేళ్లుగా రాష్ర్టంలో హడావుడి తప్ప చేసిన అభివృద్ధి భూతద్దం పెట్టినా కనిపించడం ఎద్దేవా చేశారు.