12 May, 2026 | 1:23 AM

ప్రైవేటు రంగంలో ఉన్నత అవకాశాలు

12-05-2026 12:00 AM
  1. ఉద్యోగార్థులు వినియోగించుకోవాలి 
  2. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 
  3. ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా సరూర్‌నగర్‌లో మెగా జాబ్ మేళా 

ఎల్బీనగర్, మే 11: ప్రైవేటు రంగంలో ఉన్నత అవకాశాలు ఉన్నాయని, నిరుద్యోగు లు అందిపుచ్చుకోవాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాల న ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మెగా జాబ్ మే ళాను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించి మా ట్లాడారు. జాబ్ మేళాలో  123 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు.

ఏఐ, ఐటీ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాన్ని పెంపొం దించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్ర జా ప్రభుత్వం  యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు అమ లు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలు యువత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్నాయని పేర్కొ న్నారు.

రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మ న్ మల్రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిం చే లక్ష్యంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇ లాంటి జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడు తూ.. నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశమే ప్రభుత్వ సంకల్పమన్నారు. జాబ్  మేళాలో 3716 ఉద్యోగార్హులు పాల్గొనగా, 1645 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి, 779 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని చె ప్పారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కె.కిరణ్మయి, టీయుఎఫ్‌ఐడీసీ  చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి, మాజీ కార్పొరేటర్ ధర్ప ల్లి రాజశేఖర్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్లు శ్రీల క్ష్మి, డి.వినయ్ కుమార్, మహేశ్, డీట్ డైరెక్టర్ జె.రాజేశ్వర్ రెడ్డి, టాస్క్ సీఈవో నితిన్ కు మార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దుల వెంకటేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు దాచర్లపల్లి శ్రీపాల్‌రెడ్డి పాల్గొన్నారు.