నకిలీ విత్తనాలను అరికట్టాలి
నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై అందించాలి
అఖిల భారత రైతు కూలీ సంఘం
ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): నకిలీ విత్తనాలను అరికట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులను సబ్సిడీపై ప్రభుత్వం రైతులకు సకాలంలో అందించాలని అఖిలభారత రైతు కలీ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ అధికారికి ప్రతి పత అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షుడు కొమరం సత్యనారాయణ, కార్యదర్శి పూనెం రంగన్న మాట్లాడుతూ... ఆళ్లపల్లి మండలం పూర్తిగా ఏజెన్సీ మండలమని ఎక్కువ శాతం ఆదివాసి పేద రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి రైతులకు పరిస్థితిని పరిగణలో ఉంచుకొని నాణ్యమైన విత్తనాలను ఎరువులను సబ్సిడీపై అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం నాయకులు బట్టు సురేష్ గాదె రాజు బతకయ్య మెస్సు గోపాల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు






