రాహుల్ ఎన్నిక హర్షణీయం
నేత హనుమంతరావు
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ప్రతిపక్ష హోదాలో పార్లమెంట్‌లో బడుగు, బలహీన వర్గాల తరఫున గొంతును వినిపిస్తారని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ఎన్నిక కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాహుల్‌కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన తర్వాత బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కుల గణన చేయాలని నిర్ణయం తీసు కున్నారని.. ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా అన్ని వర్గాల సమస్యల కోసం కేంద్రం పై ఒత్తిడి తీసుకొస్తారని అభిప్రాయపడ్డారు. పీవీ జన్మదినం సందర్భంగా శుక్రవారం నెక్లెస్ రోడ్డులో ఆయన సమాధి వద్ద నిర్వహించే కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరుకావాలని కోరారు.




