ఎమ్మెల్యేల కొనుగోళ్లను నిలిపివేయాలి
కాంగ్రెస్‌పై ఎంపీ వద్దిరాజు ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల కొనుగోళ్లను కాంగ్రెస్ పార్టీ నిలిపివేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హెచ్చరించారు. ఇటువంటి అప్రజాస్వా మిక పద్ధతులకు వెంటనే స్వస్తి చెప్పాలని, ఫిరాయింపులను ప్రోత్సహించ బోమని గొప్పగా చెప్పిన నాయకులు, అందుకు విరుద్ధంగా వ్యవ హరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి, పార్థసారథితో కలిసి ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని పాలమూరు, రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి జాతీయ హోదా కల్పించి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని, తమ రాష్ట్రానికి గొప్ప ఆదాయ వన రు అని, దీనిని ప్రైవేట్ పరం చేయడాన్ని అంగీకరించబోమని పేర్కొన్నా రు. ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలు, కుట్రలను తమ నాయకులు కేసీఆర్ భగ్నం చేశారని, గనుల పరిరక్షణకు పోరాటం చేశామని, అవస రమైతే మరోసారి ఉద్యమానికి వెనుకాడబోమని స్పష్టంచేశారు. కేంద్ర గనుల శాఖ మంత్రిగా ఉన్న తెలంగాణ బిడ్డ కిషన్‌రెడ్డి తగు చొరవ తీసుకుని బయ్యారంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పేలా చర్యలు తీసుకో వాలని కోరారు.
బయ్యారం, ఛత్తీష్‌గఢ్ రాష్ట్రం బైలడిల్లలో సమృద్ధిగా ఉన్న ఇనుప ఖనిజం సధ్వినియోగం చేసుకునేల ఉక్కు కర్మాగారం ఏర్పా టు చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దీం తో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఖాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్‌నాయు డు, చంద్రశేఖర్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.




