గాంధీభవన్‌లో రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు
- హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదానం
హైదరాబాద్/ఎల్‌బీనగర్, జూన్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. యుజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాన్ని భట్టి, కోమటిరెడ్డి ప్రారంభించి, మంత్రి కోమటిరెడ్డి , యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, 300 మంది వరకు రక్తదానం చేశారు. ఫిషర్‌మెన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో అన్నదానం చేపట్టారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తదితరులు కేక్ కట్ చేశారు. రాహుల్‌గాంధీని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కలుసుకున్నారు. రాహుల్‌గాంధీకి పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌గాంధీ భవిష్యత్‌లో ప్రధాన మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.






