19 June, 2026 | 5:40 PM

భారతదేశ ఐక్యత ప్రపంచానికి చాటి చెప్పింది రాహుల్ గాంధీ

19-06-2026 04:14 PM

బోథ్(విజయక్రాంతి): భారతదేశ ఐక్యతను ప్రపంచానికి భారత్ జోడో యాత్ర ద్వారా తెలిపిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ అని సోనాల మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతన జిల్లా కార్యదర్శి ఎల్ పోశెట్టిలు జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుడాల హరీష్ లు పేర్కొన్నారు. శుక్రవారం సోనాల మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ సమగ్రత కోసం భారత్ జూడో యాత్ర చేపట్టి దేశ ప్రజల్లో ఐక్యత భావం పెంపొందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మునేశ్వర్ సోమన్న జుంగల భోజన్న సీనియర్ నాయకులు సుదర్శన్ కసిరిపోతన్న అమృత రావు షేక్ మహిముద్ భీమ్రావు పాటిల్ శ్రీనివాస్ చంద్రకాంత్ రాజేశ్వర్ పరుశురాం  పాల్గొన్నారు