16 July, 2026 | 11:55 PM

రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి

03-07-2024 03:04 AM
  • మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత రాంచందర్ రావు
  • హిందువులు హింసకు పాల్పడతారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం

హైదరాబాద్, జూలై 2: రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడిన మాటలు దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని.. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. హిందువులు హింసకు పాల్పడుతారంటూ వ్యాఖ్యలు చేసిన రాహు ల్ గాంధీ ప్రపంచంలోని హిందువులందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్ మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని, అబద్ధాలకు తల్లిలాంటిదని ఆరోపించారు. ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమంది సిక్కులను ఊచకోత కోశారని, అనేక దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పకుంటే ఊరుకునేది లేదన్నారు. ఈ సమావేశంలో బీజేసీ రాష్ర్ట కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి, బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్వీ సుభాష్, బీజేపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.