టైడీని కొనుగోలు చేసిన ఫెనోమ్
03-07-2024 03:06 AM
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): కొత్త ఉద్యోగుల నియామకాల నుంచి రిటైర్ అయ్యే వరకు అసాధారణమైన ప్రీ ఆన్‌బోర్డింగ్ అనుభవాలను అందించే మానవ వనరుల సాంకేతిక సంస్థ టైడీని ఫెనోమ్ కొనుగోలు చేసినట్లు ఆ సంస్థ సీఈఓ మహే బైరెడ్డి తెలిపారు. ఉద్యోగంలో చేరేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయడానికి తమ సంస్థ తోడ్పాటును అందిస్తోందన్నారు. టైడీని కొనుగోలు చేయడం ఫెనోమ్ పురోగతికి ఎంతో దోహదపడుతుందన్నారు.






