05-10-2025 12:42:15 AM
వ్యాపార వర్గాలు, విద్యార్థులు, రాజకీయవర్గాలతో భేటీ
చేగువేరా ‘మోటార్ సైకిల్ డైరీస్’తో పోలుస్తున్న నెటిజన్లు
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గతంలో చేపట్టిన నాలుగు దేశాల దక్షిణ అమెరికా పర్యటన మార్క్సిస్ట్ భావజాలాన్ని చాటిచెప్పేలా ఉందని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. రాహుల్ పర్యటిస్తున్న బ్రెజిల్, కొలంబియా, పెరూ, చిలీకి చెందిన నాయకులు బలమైన మార్క్సి స్ట్ ఆలోచనపరులు కావడం, అక్కడి వ్యా పార వర్గాలు, విద్యార్థులు, రాజకీయ, విద్యావేత్తలతో భేటీ కావడం ఆసక్తికరమైన అంశం.
ఈ పర్యటనపై నెటిజన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాహుల్ కొంతకాలం నుం చి కులగణన, పేదలకు సంపద పంపిణీ వం టి అంశాలను బలంగా సమర్థిస్తున్నారు. అలాగే, క్రోనీ పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శిస్తున్నారు. సామ్యవాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా, పాలనలో ఉన్న ఈ దేశాలను ఆయన సందర్శించడం వెనుక, ఏదైనా సైద్ధాంతిక అనుబంధం ఉం దా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతున్నది. 73 ఏళ్ల క్రితం నూనుగుమీసాల ప్రాయంలో చేగువేరా, అతడి స్నేహితుడు అల్బెర్టో గ్రెనడో కలిసి చేసిన ప్రయాణం వారి జీవితాలను మార్చివేసింది.
‘మోటార్ సైకిల్ డైరీస్’ పేరుతో తర్వాత పుస్తకం విడుదలైంది. చే ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత విప్లవకారుడయ్యా డు. యాత్రలో చే ప్రత్యక్షంగా చిలీ, పెరూ, వెనుజులా ప్రజల కడగండ్లను చూశాడు. దక్షిణ అమెరికా ఖండంలో రాజ్యమేలుతున్న దోపిడీ, అసమానతలు చూసి విప్లవకారుడిగా అవతరించాడు. సరిగ్గా అలాగే రాహు ల్‌గాంధీ గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు వామపక్ష ప్రభుత్వం ఏలుతున్న కొలంబియా రాజధాని బొగొటాలో తన పర్యటనను ప్రారంభించారు.
చేగువేరాకు, ఆయన పర్యటనకు సంబంధం, సారుప్యం లేకపోయినా తన ప్రయాణంలో పదే పదే ‘మోటార్‌సైకిల్ డైరీస్’ అనే ప్రస్తావన తీసుకొచ్చారు. పర్యటన తర్వాత చేగువేరా మాదిరిగానే, రాహుల్ కూడా భారత్ జోడో యాత్ర చేపట్టాడు. భారతదేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదల కష్టాలను చూశాడు. అసమానతలను దగ్గరగా చూశాడు. యాత్రలో యువత ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రాహుల్ తాజా పర్యటనలో తాను స్వయంగా బైక్ నడపకపోయినా.. కొలంబియాలో భారతీయ బైక్ కంపెనీలను ప్రశం సిస్తూ బజాజ్ పల్సర్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత నెలలో బిహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి చేపట్టిన ‘ఓటర్ అధికార యాత్ర’ సందర్భంగా రాహుల్ బైక్ నడిపారు. స్థానికుడి నుంచి ఆ వాహనం తీసుకుని నడు పగా, అది కాస్త చోరీకి గురైంది. రాహుల్ దీంతో వాహనదారుడికి కొత్త బైక్‌ను కొనిచ్చారు. ఇలా రాహుల్‌కు, బైక్‌లకు తరచుగా సంబంధం కనిపిస్తూనే ఉంది.