calender_icon.png 5 October, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరేలీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

05-10-2025 12:39:52 AM

లక్నో, అక్టోబర్ 4: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఇటీవల చోటుచేసుకున్న ‘ఐ లవ్ మహమ్మద్’ హింసాత్మక ఘటనలు సద్దుమణిగిన తర్వాత జిల్లా యంత్రాంగం, బరేలీ అభివృద్ధి అథారిటీ (బీడీఏ) అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాయి. భవన నిర్మాణ నియమాలను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలు, ప్రభుత్వ భూమిని ఆక్రమించిన భవనాలను బుల్డోజర్లతో నేలమట్టం చేశాయి. కూల్చివేసిన కట్టడాల జాబితాలో జాఖిరా ప్రాంతంలోని రాజా ప్యాలెస్ ఉంది.

కట్టడ అధినేత డాక్టర్ నఫీస్ అహ్మద్‌కు ఇటీవల పట్టణంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఫైక్ ఎన్‌క్లేవ్ భవనాన్నీ యం త్రాంగం కూల్చివేసింది.

మౌలానా తౌకీర్ రజా అనే వ్యక్తికి ఫరత్ ఆశ్రయం ఇవ్వండంతో అతడిని ఇంటిని సీజ్ చేశారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. సైలానీ మార్కెట్‌లోనూ యత్రాంగం అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది.