30 July, 2026 | 1:08 AM

గుడుంబా కేంద్రాలపై దాడి

30-07-2026 12:00 AM

మోతె, జూలై 29: మండల పరిధిలోని గోపతండా, గోల్ తండా, రాంపురంతండాలలో బుధవారం గుడుంబా కేంద్రాలలో దాడులు చేసి పట్టు కోవడం జరిగిందని ఎక్సైజ్ అధికారులు తెలియజేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశానుసారం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత ఆధ్వర్యంలో సూర్యాపేట ఎక్సైజ్ స్టేషన్ మరియు డిటిఎఫ్ సూర్యాపేట బృందం నాటు సారాయి తయారు చేసేవారి ఇండ్లలో దాడులు నిర్వహించి, 16 లీటర్ల సారాయిని సీజ్ చేసి, 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. ఈ దాడులలో ట్రైని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతు ,ఎస్త్స్రలు సురేందర్ బెనర్జీ, శోభారాణి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.