నకిరేకల్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్.. స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, జులై 29 : నకిరేకల్లో నూతన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం పరిశీలించారు. సనకిరేకల్ మున్సిపాలిటీ బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని గుర్తించారు. పాఠశాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదిత స్థలం, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుబాటులో ఉండే సౌకర్యాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.
నకిరేకల్ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పబ్లిక్ స్కూల్ను చేపట్టిందని తెలిపారు. ఈ స్కూల్ ద్వారా విద్యార్థులకు ఆధునిక విద్యా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.విద్యారంగ అభివృద్ధికి ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజలకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.






