calender_icon.png 8 February, 2026 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్‌పై దాడులు

08-02-2026 01:37:39 PM

హైదరాబాద్: హైదరాబాద్, ఢిల్లీ, ముంబయిలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం ఆదివారం సోదాలు నిర్వహించింది.  జీఎస్టీ ఎగవేత, అక్రమ లావాదేవీల విషయంలో కేసు నమోదు కావాడంతో ఆన్ లైన్ గేమింగ్ సంస్థ అయిన వెగోఫిన్ డిజిటల్ సొల్యూషన్స్ కార్యాలయాల్లో దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.5000 కోట్ల విలువైన ఆన్ లైన్ గేమింగ్ సిండికేట్ పై దాడులు చేసి  గేమింగ్ సంస్థ దేశవ్యాప్తంగా నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గేమింగ్ సిండికేట్ కు ముంబయికి చెందిన వైఎస్ ప్రభు కుమార్, హైదరాబాద్ కు చెందిన రాజశేఖర్ రెడ్డిలు  ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు అధికారులు దర్యాప్తుల్లో తేలింది.