calender_icon.png 8 February, 2026 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి

08-02-2026 01:21:45 PM

నల్గొండ: నల్గొండ జిల్లాలోని సాగర్ ఎడమ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. త్రిపురారం మండలం కంపాసాగర్ కు చెందిన పుల్లయ్య, పద్మ అనే దంపతులు కారులో ప్రయాణిస్తున్నారు. శనివారం రాత్రి నిడమానూరు మండలం ముకుందాపురం వద్దకు రాగానే కారు అదుపుతప్పి సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. ఆ దంపతులు కారులోనే చిక్కుపోయి గలంతయ్యారు. ఆదివారం ఉదయం కాల్వ నుంచి కారును బయటకు తీసి చూడగా, అందులో పద్మ మృతదేహాం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పుల్లయ్య కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కారు కాలువలో పడిన ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.