రైల్వే పనుల్లో వేగం పెంచాలి
11-02-2025 12:00 AM
ఇటీవల చాలాచోట్ల రైల్వేలైన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. వీటిలో పురోగతి చాలా మందకొడిగా ఉంటున్నది. ఈ కాలయాపన కారణంగా చాలా స్టేషన్లలో రైళ్లను ఎంతోసేపు నిలిపి వేస్తున్నారు. మొత్తం మీద గంటల తరబడి రైళ్లను ఆపుతుండడంతో ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరడం బాగా ఆలస్యమవుతున్నది. రైల్వే లైన్ల మరమ్మతు పనులను వేగవంతం చేసేలా రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైలు ప్రయాణీకులు సకాలానికి గమ్యం చేరుకుంటారు.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్






