రానున్న నాలుగు రోజులు వర్ష సూచన
23-06-2024 01:02 AM
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాలో వరుసగా నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని శనివారం హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. ఆదివారం నిజామబాద్, జగిత్యాల, హైద రాబాద్, మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డితోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొన్నది. ఇప్పటికే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, శనివారం ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 6.4 మి.మీ, అత్యల్పంగా కరీంనగర్ జిల్లాలో 2.2 మి.మీ వర్షపాతం నమోదైంది.






