పోస్టాఫీసుల్లో 10.54 లక్షల ‘సుకన్య సమృద్ధి’
రీజియన్ హెడ్‌క్వార్టర్స్ పోస్ట్‌మాస్టర్ జనరల్ టీఎం శ్రీలత
100మంది చిన్నారుల ఖాతాలకు యూపీఎస్‌సీ ర్యాంకర్ల సాయం
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 10,54,062 ’సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాలను పోస్టాఫీసుల్లో తెరిచినట్లు రీజియన్ హెడ్‌క్వార్టర్స్ పోస్ట్‌మాస్టర్ జనరల్ టీఎం శ్రీలత పేర్కొన్నారు. పేద బాలికలకు చేయూతనందించే ఉద్దేశంతో స్ఫూర్తి కార్యక్రమం ద్వారా శనివారం తపాలా శాఖ 100 మంది బాలికలతో ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాలను తెరిపించింది. ఈ ఖాతా తెరిచేందుకు అవసరమైన ఆర్థికసాయాన్ని యూపీఎస్‌సీ 2024లో ర్యాంకులు పొందిన 64 మంది అందించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ.. బాలికల భవిష్యత్, వారి ఆర్థిక స్వావలంబన కోసం ఈ ఖాతాలు ఉపయోగపతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్ నర్సింహారెడ్డి (ఐఆర్‌ఎస్), రామిరెడ్డి (ఐఆర్‌ఏఎస్), అనురాగ్‌సింగ్ (ఐఆర్‌ఎస్) తదితరులు పాల్గొన్నారు.






