6 July, 2026 | 9:02 AM

రాజస్థాన్‌కు వర్షం దెబ్బ

20-05-2024 02:47 AM

‘ధైర్య వంతులనే అదృష్టం వరిస్తుంది’ అనే నానుడిని నిజం చేస్తూ.. ప్రకృతి కూడా సన్‌రైజర్స్‌కు అండగా నిలిచింది. దీంతో చివరి లీగ్ మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో లీగ్ దశను ముగించింది. ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. రైజర్స్ రెండో స్థానాన్ని ఖాయం చేసుకోగా.. రాయల్స్ మూడో ప్లేస్‌తో లీగ్ దశను ముగించింది. 

మూడో స్థానంతో లీగ్ దశ ముగింపు

కోల్‌కతాతో మ్యాచ్ రద్దు 

రెండో ప్లేస్ ఖరారు చేసుకున్న సన్‌రైజర్స్

గువాహటి: గత నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసి.. ప్లే ఆఫ్స్ రేసులో వెనుకబడ్డ ట్లు కనిపించిన రాజస్థాన్‌కు చివరి మ్యాచ్‌లో వర్షం దెబ్బకొట్టింది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా కోల్‌కతాతో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దుంది. దీంతో రాజస్థాన్, కోల్‌కతా చెరో పాయింట్ పంచుకోవాల్సి వచ్చింది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌లో లీగ్ దశలోని 70 మ్యాచ్‌లు ముగిసేసరికి కోల్‌కతా 20 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలవగా.. హైదరాబాద్, రాజస్థాన్ 17 పాయింట్లు సాధించాయి. అయితే నెటరన్‌రేట్‌లో హైదరాబాద్ (0.414) మెరుగ్గా ఉండటంతో.. రాజస్థాన్ (0.273) మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతాతో హైదరాబాద్ తలపడనుంది.