పంచాయతీ కార్యదర్శులకు రెయిన్ కోట్లు అందజేత
26-06-2026 12:00 AM
నాగిరెడ్డిపేట్, జూన్ 25 (విజయక్రాంతి): మండలంలో అన్ని గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు రైన్ కోట్లు అందజేయడం జరిగిందని ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వర్షాకాలం దృశ్య అధిక వర్షాలు పడనున్న సందర్భంగా జిల్లా నుండి ప్రతి పంచాయతీ కార్యదర్శి రైన్ కోట్లు రావడంతో ప్రతి కార్యదర్శి ఒకటి చొప్పున అందజేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్ చారి,పంచాయతీ కార్యదర్శులు సంతోష్ కుమార్, కార్తీక్, వెంకట్ రాములు, శంకర్ సంతోష్ కుమార్, సుజాత, సంజీవులు ఉన్నారు.






