4 రోజులు జిల్లాల్లో వర్షాలు
30-06-2025 01:29 AM
- వాతావరణ కేంద్రం అంచనా
- ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షపాతాలు నమోదు అవుతున్నాయి. ఈ మేరకు వాతావరణ కేంద్రం మరో 4 రోజుల పాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ అక్కడక్కడక వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు రాష్ట్రమంతా వీస్తాయని అంచనా వేసంది.






