21 April, 2026 | 7:27 PM

రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

02-12-2024 09:22 PM

ఆలయంలో కిక్కిరిసిన భక్తులు

సిరిసిల్ల (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. సోమవారం స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ధర్మగుండలంలో స్నానాలు అచరించి, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం క్యూలైన్ల ద్వారా స్వామి వారిని దర్శించుకోని, కోడె మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని 38 వేల మంది పైగా భక్తులు దర్శనం చేసుకోగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు.