862 కిలోల గంజాయి దహనం..
02-12-2024 10:05 PM
పరిశీలించిన ఎస్పీ గౌష్ అలం...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ నిషేధిత గంజాయిని పోలీసులు దహనం చేశారు. జిల్లాలో ఇటీవల నమోదైన 14 కేసుల్లో పట్టుబడ్డ 862 కిలోల గంజాయిని నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వద్ద గల శ్రీ మెడికేర్ సర్విసెస్ సెంటర్ లో గంజాయి డిస్పోజల్ కమిటీ ఆధర్యంలో దహనం చేశారు. ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం స్వయంగా పరిశీలించారు. కమిటీ సభ్యులు డి.సి.ఆర్.బి డిఎస్పి సురేందర్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, డి.సి.ఆర్.బి ఎస్.ఐ హకీమ్ లు దగ్గరుండి గంజాయిని దహనం చేయించారు.






