6 July, 2026 | 1:11 PM

Breaking News

నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •  

జాతీయ సబ్ జూనియర్ హాకి పోటీలకు ఎంపికైన శ్రావ్య

02-12-2024 09:15 PM

క్రీడాకారినిని సన్మానించిన బిసి సంఘ నేతలు

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సంతోష్ కుమార్తె శ్రావ్య నేషనల్ హాకీ టోర్నమెంటుకు ఎంపికైనట్లు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్ తెలిపారు. సోమవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న శ్రావ్య ఆర్ఆర్బి గ్రౌండులో నిర్వహించనున్న హాకీ క్రీడలకు తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొననున్న టీంకు ఎంపికైనట్లు తెలిపారు. సోమవారం బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తు తల్లిదండ్రులకు గురువులకు కామారెడ్డి జిల్లాకు రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులను సౌమ్య తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు కాముని సుదర్శన్, బిసి రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి సూర్య మల్లేష్, కొఇంచార్జ్ చింతల శంకర్, జిల్లా స్పెషల్ మీడియా ఇంచార్జ్ రాజేందర్, రాజంపేట మండల అధ్యక్షులు మురళి, పల్వంచ మండల ఇన్చార్జి బాలకృష్ణ, పాల్వంచ అధ్యక్షులు అంజయ్య, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు రాజయ్య, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.